ముంబయ్: భారత్ నుంచి మరో మూవీ ఆస్కార్ బరిలోకి నిలవనుంది. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను టిను సురేష్ దేశాయ్ తెరకెక్కించారు. ఈ సినిమా ఆస్కార్ రేసులో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్ గా చిత్రబృందం నామినేషన్ వేసింది. ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉండడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు చెబుతున్నారు. ఆస్కార్ 2024లో అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీపడుతున్నాయి. వీటిలో మలయాళ మూవీ ‘2018’ ఇప్పటికే పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నుంచి మిషన్ రాణిగంజ్ పోటీ పడుతుంది. ఈ సినిమా కథ విసయానికొస్తే రాణి గంజ్ లో 65 మంది మైనర్లను కాపాడిన జశ్వంత్ సింగ్ గిల్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఇది కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఆస్కార్ బరిలో నిలవడంపై ప్రశంసలు దక్కుతున్నాయి.
అస్కార్ బరిలో మరో ఇండియన్ మూవీ
- Advertisment -