హైదరాబాద్, జనత న్యూస్: భారత రాష్ట్ర సమితికి మరో బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి తాటి కొండ రాజయ్య, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి వాళ్లు పార్టీని వీడారు. కారణం ఏదైనా ఒక్కొక్కరు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ ఇంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగారు. ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళో రేపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన చంద్రశేఖర్ కు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీగా పోటీ చేస్తే అల్లు అర్జున్ ప్రచారం చేస్తాడా? అనేది ఆసక్తిగా మారుతుంది.
Allu Arjun : అల్లు అర్జున్ మామకు కాంగ్రెస్ ఎంపీ టికెట్?
- Advertisment -