కడప లోక్ సభ ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న అవినాష్ కు శుక్రవారం మరోసారి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దానిని తోసిపుచ్చింది. వైయస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా చేరిస్తూ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ ఆయన విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే ఆ తర్వాత వివేకా కుమార్తె సునీత దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి సాక్షుల్ని, తనను వేధిస్తున్నారని కారణం చెబుతూ ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
- Advertisment -