Wednesday, October 28, 2026

 మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేసిన కలెక్టర్

కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం  5 కే రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా   వాకర్సు, మహిళలతో కలిసి  కలెక్టర్ దాదాపు మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేశారు.    అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మానేరు డ్యాంపై 5కే రన్, వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై 5కే రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి రోజూ శారీరక వ్యాయామాన్ని చేయాలని సూచించారు.

ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండవద్దని పేర్కొన్నారు. బాధ్యత లు, పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. ఫిట్నెస్ ఫై కరీంనగర్ ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించేందుకు కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్టు అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి మాట్లాడుతూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలనే ఉద్దేశంతో 5కే రన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న మహిళలు తమ దినచర్యలో సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ భాగం చేసుకోవాలని కోరారు. “తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్” ప్రతినిధులు మంచినీరు, స్నాక్స్ అందజేశారు. సైక్లింగ్లో రాణిస్తున్న
మహిళా సభ్యులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి పద్మావతి, కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు పసుల మహేష్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత, వన్ టౌన్ సిఐ సరిలాల్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, రన్నర్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు విమల, హేమ భట్, స్వప్న, గాయత్రి ,గీతిక, కావ్య, ఉషా ఖండాల్, రవీందర్, శివ, రోహిత్, సంతోష్, శేఖర్, కిరణ్, అజయ్ ఖండాల్, అఖిల్, పరుశరాం, గులాబ్ సింగ్ చౌహాన్, శ్రీనివాస్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page