Monday, October 26, 2026

ప్రభుత్వ అధికారిణి దారుణ హత్య

బెంగుళూరు:  కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిణి దారుణ హత్యకు గురయ్యారు. భూగర్భ గనుల శాఖలో పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ బదిలీపై ఇటీవలే బెంగుళూరుకు వచ్చారు. ఈ తరుణంలో ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎస్ ప్రతిమ 2017లో భూగర్భ గనుల శాఖలో ఉద్యోగంలో చేరారి. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో పనిచేశారు. రామనగర జిల్లాలో పనిచేసిన ఆమె ఇటీవలే బెంగుళూరుకు బదిలీ య్యారు. నగరంలోని దొడ్డకల్లసంద్రలోని గోకుల అపార్టుమెంట్ లో ఒంటరిగా ఉంటున్నారు. శనివారం రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నారు.ఆయితే ఆమె సోదరుడు ప్రతీక్ రోజూవారీలో భాగంగా ప్రతిమకు ఫోన్ చేశారు. అయినా స్పందించకపోవడంతో పక్కనున్న వారికి ఫోన్ చేశారు. వారు సమాచారం ఇవ్వడంతో ప్రతిమ నివాసారికి వచ్చి చూసేసరికి ఆమె మరణించి ఉంది.

ప్రతిమకు 18 ఏళ్ల కిందట సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహం అయింది. ఇటీవలే సొంతూరు తుడ్కిలో కొత్త ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశారు. అయితే వ్యవసాయ పనుల్లో భాగంగా భర్త, కుమారుడు అక్కడే ఉన్నారు. విధుల్లో భాగంగా ప్రతిమ బెంగుళూరులో ఒంటరిగా ఉంటోంది. అయితే ఆమె హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్వేషిస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page