రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
జనతా న్యూస్, కరీంనగర్:
భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ మానవతా సేవల్లో విశిష్ట పాత్ర పోషిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన కరీంనగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గాన్ని సన్మానించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విపత్తులు, అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య సేవలు, సామాజిక సేవల ద్వారా ప్రజలకు అండగా నిలవడం రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన లక్ష్యమన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త నిల్వలను పెంచడంలో సహకరించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించడం, యువతలో సేవా భావం, స్వచ్ఛంద సేవా స్ఫూర్తి, మానవతా విలువలను పెంపొందించడం వంటి కార్యక్రమాలను సంస్థ నిర్వహిస్తోందని తెలిపారు.
ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు అవసరమైన వారికి ఆరోగ్య, సామాజిక, అత్యవసర సేవలను అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని, సంస్థకు సంబంధించిన మానవతా విలువలను ఎప్పటికప్పుడు పరిరక్షించాలని ఆయన సూచించారు.
సన్మానించిన నూతన కార్యవర్గ సభ్యులు
- పీ. కేశవరెడ్డి – గౌరవ ఛైర్మన్
- సంగెం లక్ష్మణరావు – ఛైర్మన్
- వి. రాధాకృష్ణారెడ్డి – ఉపాధ్యక్షులు
- గోనె శ్రీనివాస్ – కోశాధికారి
- కే. మహేశ్వర్ – రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
- ఎం. రాకేష్ – యువజన సమన్వయకర్త
- ఇంజనీర్ కోల అన్నారెడ్డి, పీ. విద్యాసాగర్, సీహెచ్. సురేష్, పి. శ్రీహరి రెడ్డి, ఆర్. శ్రీనివాస్, పి. నరేందర్, హెచ్. రాజిరెడ్డి, కే. మనోహరావు, ఏ. మునిందర్ – జిల్లా కార్యవర్గ సభ్యులు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా టీఎన్‌జీవోస్ అధ్యక్షులు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, టీఎన్‌జీవోస్ రాష్ట్ర బాధ్యులు సర్దార్ హర్మిందర్ సింగ్, టౌన్ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, టౌన్ కార్యదర్శి సుమంత్ రావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


