Wednesday, October 7, 2026

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి

రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు ఎంపిక

జనతా న్యూస్, కరీంనగర్:
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, క్రీడల్లోని మెలకువలను విశ్లేషించి నైపుణ్యం సాధించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్‌-14 బాలబాలికల టేబుల్‌ టెన్నిస్ పోటీలకు ఎంపికైన సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ టేబుల్‌ టెన్నిస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ క్రీడను ‘రాయల్ గేమ్’గా పరిగణిస్తారని తెలిపారు. టేబుల్‌ టెన్నిస్ ఆడటం ద్వారా విద్యార్థులు శారీరకంగా దృఢంగా తయారవడంతో పాటు వారి ఆలోచనా విధానంలోనూ సానుకూల మార్పులు వస్తాయని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేసి, వాటికి చక్కటి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులకు నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా వివిధ క్రీడల్లో శిక్షణ అందిస్తూ, ప్రతిభ ఆధారంగా వివిధ టోర్నమెంట్లకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు.

ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేట్ అకాడమీలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి అండర్‌-14 బాలబాలికల టేబుల్‌ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన కళ్యాణం హర్షిత్ సాయి (8వ తరగతి), హంసికామణి (8వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అండర్‌-14 బాలబాలికల టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించి, రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page