Wednesday, October 7, 2026

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

జనతా న్యూస్, కరీంనగర్:
క్రీడలు విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో విజయమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా సాధన చేసి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో అవసరమైన వనరులు, ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల సెప్టెంబర్ 29న కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన వివిధ ఎస్‌జీఎఫ్‌ జోనల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

అండర్‌–14 బాలుర హాకీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారు:
డి. శివన్ రెడ్డి, ఏ. రితిక్ పటేల్, వీ. రేవంత్.
రాష్ట్రస్థాయి పోటీలు రంగారెడ్డిలో నిర్వహించనున్నారు.

అండర్‌–14 బాలికల హాకీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారు:
జోయా, ఏ. నైకా రెడ్డి, వీ. లక్ష్మీ ప్రసన్న.
రాష్ట్రస్థాయి పోటీలు కామారెడ్డిలో నిర్వహించనున్నారు.

అండర్‌–17 బాలుర హాకీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారు:
సీహెచ్. జయంత్.
రాష్ట్రస్థాయి పోటీలు జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించనున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు డాక్టర్ నరేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అత్యధిక సంఖ్యలో విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడంలో కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన...

బెజ్జంకి, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు....

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

జనతా న్యూస్, కరీంనగర్:క్రీడలు విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

బెజ్జంకి, అక్టోబర్ 5, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై వెంటనే బుల్డోజర్ చర్యలు చేపట్టాలని స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా మాజీ కోఆర్డినేటర్...

Most Popular

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ

బెజ్జంకి, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు....

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

జనతా న్యూస్, కరీంనగర్:క్రీడలు విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

బెజ్జంకి, అక్టోబర్ 5, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై వెంటనే బుల్డోజర్ చర్యలు చేపట్టాలని స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా మాజీ కోఆర్డినేటర్...

You cannot copy content of this page