బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, పూడికను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొడవెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ “పరిశుభ్రమైన గూడెం–ఆరోగ్యకరమైన గూడెం” లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. నర్సరీలో మొక్కల పెంపకంతో పాటు వాటిని నాటడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.


