బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: వడ్లూరు గ్రామపంచాయతీ ఆవరణలో ఆరాధ్య ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పులి రమేష్‌గౌడ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పులి రమేష్‌గౌడ్ మాట్లాడుతూ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ద్వారా నైపుణ్యంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిద్ధిపేట–కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ ఇన్‌చార్జి గుర్రం సంగీతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు మాంకాల స్వామి, పులి శ్రీకాంత్, గాండ్ల రాధ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


