Thursday, October 1, 2026

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ, దాండియా వేడుకలు

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ, దాండియా

కరీంనగర్: స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ మైదానంలో బతుకమ్మ, దాండియా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ వి. వనజా నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని అన్నారు. బతుకమ్మను పూజించడం ద్వారా ప్రకృతిని గౌరవించినట్లేనని పేర్కొన్నారు. రంగురంగుల స్థానిక పూలతో బతుకమ్మలను పేర్చి, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడటం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుందని తెలిపారు.అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు

వివిధ అంశాలను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన బతుకమ్మలను ఏర్పాటు చేయగా, విద్యార్థులు ఉత్సాహంగా దాండియా నృత్యాలు చేశారు. తల్లిదండ్రులు సైతం కోలాట ప్రదర్శనలతో వేడుకలకు మరింత వన్నె తెచ్చారు.విద్యుత్ దీపాల వెలుగుల మధ్య నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆకాశంలో ఆశల హరివిల్లు, రమణి బిందాల, ఓరుగల్లు పిల్ల, కమ్మని నీ ప్రేమలేఖలే, జామురాత్రి, అందమైన ప్రేమ రాణి, మాటేరాని చిన్నదాని తదితర పాటలకు విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. బతుకమ్మ, దాండియా వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో వివిధ అల్ఫోర్స్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

నారాయణపూర్‌పై కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన

గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దుపది శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ.. ప్రభుత్వానికి సమగ్ర నివేదికఅభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వండి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

చిన్నారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కరీంనగర్, అక్టోబర్ 1 (జనతా న్యూస్): చిన్నారుల సంక్షేమం, మహిళా...

కూల్‌డ్రింక్ సీసాలపై తుప్పు.. 60 కేసులు స్వాధీనం

ఆహార భద్రతా శాఖ తనిఖీల్లో గుర్తింపు శాఖ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

పర్యావరణ పరిరక్షణతోనే ప్రజాహితం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు...

Most Popular

You cannot copy content of this page