Wednesday, September 30, 2026

మున్సిపల్ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు విభాగాన్ని వినియోగించుకోవాలి

జనతా ప్రతినిధితో మున్సిపల్ అదనపు కమిషనర్ సువార్త

కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల ప్రజలు పారిశుధ్యం, జనన–మరణ ధ్రువపత్రాలు, వాణిజ్య లైసెన్సులు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సువార్త తెలిపారు.

‘జనతా ప్రతినిధి’తో ఆమె మాట్లాడుతూ, పై సమస్యలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ప్రజలు మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయంలోని సంబంధిత విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు ఫిర్యాదు విభాగంలో తమ దరఖాస్తును సమర్పించాలని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ సేవలను అందించడమే కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుందని, అదే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచవచ్చని తెలిపారు.

మున్సిపల్ సేవలు పొందే సమయంలో ప్రజలు తమ దరఖాస్తులు, అవసరమైన పత్రాలను సక్రమంగా సమర్పించాలని, ఏదైనా సమస్య ఎదురైతే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని అదనపు కమిషనర్ సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని ఆమె స్పష్టం చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

మున్సిపల్ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు విభాగాన్ని వినియోగించుకోవాలి జనతా ప్రతినిధితో మున్సిపల్ అదనపు కమిషనర్ సువార్త

రాజకీయాలకు అతీతంగా సహకరించాలి

ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి తీగలగుట్టపల్లి మీదుగా వెళ్లే అన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలి జనతా ప్రతినిధితో మేయర్...

28న కరీంనగర్‌లో ‘శాతవాహన గ్రామీణ సంత’

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

మత సామరస్యంతోనే దేశాభివృద్ధి

కరీంనగర్: మత సామరస్యంతో హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, కరీంనగర్...

Most Popular

You cannot copy content of this page