..
- మత్తడి వద్ద గ్రామ సర్పంచ్ శిరిష ప్రత్యేక పూజలు
చిగురుమామిడి, జనత న్యూస్: గ్రామ సరిహద్దుల్లోని ఊరచెరువు సమృద్ధిగా నిండి మత్తడి దుముకుతుండటంతో గురువారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేడుకగా జలపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జంగ శిరీష రమణారెడ్డి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, సమర్పణలు చెల్లించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో గ్రామంలో సాగు, తాగునీటి తిప్పలు తప్పాయని హర్షం వ్యక్తం చేశారు. నిండిన చెరువులతో భూగర్భ జలాలు పెరిగి రైతన్నలకు సాగునీటి కొరత తీరుతుందన్నారు. పంటలు సమృద్ధిగా పండి, గ్రామంలోని ప్రతీ రైతు కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెడబోయిన రాజు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్, శ్రీమూర్తి శ్రీనివాస్, మంథని ప్రియాంక మహేందర్, రిటైర్డ్ టీచర్ కక్కెర్ల వెంకట మల్లు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గందే సంతోష్ కుమార్, మాజీ దేవస్థానం చైర్మన్ గందే సంపత్ కుమార్, నాయకులు పెసరూ శ్రీనివాస్, మారుపాక రమేష్, సుంకరి శ్రీనివాస్, కక్కెర్ల వీరకుమార్, పాలకేంద్రం చైర్మన్ పిట్టల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




