బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా కల్లేపల్లి గ్రామ సర్పంచ్ బిగుళ్ల మోహన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయనే ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు. అయితే ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురవడంతో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతుండటం పట్ల రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
చెరువు మత్తడి దూకుతున్న దృశ్యాలను వీక్షించేందుకు కల్లేపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని సర్పంచ్ తెలిపారు.



