Sunday, October 25, 2026

స్కిల్‌ యూనివర్సిటీలో విశ్వకర్మలకు కోర్సు

కరీంనగర్‌ లోను స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర మంత్రి  శ్రీధర్‌ బాబు
కరీంనగర్‌-జనత న్యూస్‌
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్‌ డెవలప్మెంట్‌ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు కోర్సును ప్రవేశపెడతామని, కరీంనగర్‌ హెడ్‌ క్వార్టర్‌ లోను స్కిల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ విశ్వకర్మల శ్రమ లేనిదే విశ్వంలో ఏ పనీ జరగదని అన్నారు. స్కిల్‌ యూనివర్సిటీలో విశ్వకర్మల నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సును ప్రవేశపెడతామని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. కుల వృత్తిదారులకు ఆదాయం కల్పించే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కరీంనగర్‌లో విశ్వకర్మలు భవనం నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలం పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌, విశ్వకర్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page