Monday, October 26, 2026

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం
బీసీ గణన చేపట్టి ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు
సీఎం ప్రకటన పట్ల కాంగ్రెస్‌ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల హర్షం
కరీంనగర్‌-జనత న్యూస్‌
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్త లను గెలిపించుకుంటామన్నారు కాంగ్రెస్‌కరీంనగర్‌ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల రాజేందర్‌ రావు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల్లో బీసీల గణన చేపట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌  ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం, టీపీసీసీ చీఫ్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపిటిసిలుగా, జడ్పిటిసిలుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్‌ చైర్మన్‌ లుగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. జనాభా పరంగా బీసీలకు దక్కాల్సిన వాటా అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలకులు బీసీలను ఏమాత్రం పట్టించుకోలేదని, వారికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలను చీమను చూసినట్టు చూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సమా న్యాయం జరుగుతుందని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాహూల్‌ గాంధీ ని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా 24 గంటలు శ్రమిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో  కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా తీసుకెళ్తామని వెలిచాల రాజేందర్‌ రావు పేర్కొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page