Monday, October 26, 2026

సిరిసిల్లకు పవర్‌ లూం క్లస్టర్‌ మంజూరు చేయండి

కేంద్ర టెక్స్‌ టైల్స్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు..
మంత్రి బండి సంజయ్‌ వినతి
సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి
ఢిల్లీ :
రాజన్న సిరిసిల్ల జిల్లాకు పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ను మంజూరు చేయాలని కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. ఢల్లీి గిరిరాజ్‌ సింగ్‌ను కలసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించారని, సిరిసిల్ల నేతన్నల పరిస్థితులను గిరిరాజ్‌ సింగ్‌కు క్షున్నంగా వివరించినట్లు బండి సంజయ్‌ తెలిపారు. నేషనల్‌ హ్యాండ్లూం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో యార్న్‌ డిపో ఏర్పాటు చేయాలని, యార్న్‌ సబ్సిడీ 80 శాతంకు పెంచాలని కోరారు. పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటైతే.. యంత్రాల ఆధునీకరణతోపాటు ఉత్పిత్తి పెరిగి, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అట్లాగే యార్న్‌ డిపో ఏర్పాటు వల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు తక్కువ ధరకు లభిస్తాయన్నారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులవల్ల ముడిసరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నరు. ఈ నేపథ్యంలో నూలు రాయితీ పెంపుతో పాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్‌ విజప్తిపట్ల జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారు. యార్న్‌ డిపో ఏర్పాటుతోపాటు పవర్‌ లూం క్లస్టర్‌ మంజూరుపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page