Sunday, November 1, 2026

ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి..

చివరకు కట కటాలకు !
గాంజాపై పోలీసుల ఉక్కుపాదం
జిల్లాలో 32 కిలోలు పట్టివేత
ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ స్ఫెషల్‌ ఫోకస్‌

సిరిసిల్ల-జనత న్యూస్‌

గాంజా, అక్రమ కార్యకలాపాలపై సిరిసిల్ల పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. వీటిపై జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ స్ఫెషల్‌ ఫోకస్‌ పెట్టారు. తాజాగా తంగళ్లపల్లి శివారులో నిందితుల వద్ద నుండి 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిరచారు. ఆదిలాబాద్‌ జిల్లా గాయిదిగూడ మండలం గొండు రూపాపూర్‌కు చెందిన మాడవి దిగంబర్‌, తురం అమృత్‌ రావులు కలసి తంగళ్లపల్లి శివారులో గంజాయి అమ్మెందుకు రాగా..సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సుధాకర్‌ పోలీసు సిబ్బందితో కలసి వెల్లి పట్టుకున్నారు. వారి వద్ద నుండి మూడు కిలోల గంజాయి, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా..తంగళ్లపల్లికి చెందిన క్రాంతి అనే వ్యక్తికి అమ్మెందుకు తీసుక వచ్చినట్లు తేలింది. దీంతో క్రాంతిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ సంవత్సరంలో 32 కిలోల గంజాయి పట్టివేత
జిల్లాలో ఈ సంవత్సరం 32 కిలోల 618 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి 54 కేసులు నమోదు చేసి 134 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. సిరిసిల్లను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు స్ఫెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై డయల్‌ 100, లేదా టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ 87126 56392 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి యువత మత్తు రవాణా వైపు వెళ్తున్నారని..చివరకు జైలుపాలై జీవితాన్ని అంధ కారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌. చెడు మార్గాన వెళ్లవద్దని వారికి హితవు చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, సి.ఐ లు మొగిలి, ఎస్‌ ఐ లు సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page