Tuesday, October 27, 2026

పందెం కోళ్లకు వేలం పాట !

అదీ కోర్టు ఆదేశాల మేరకు..
పందెం కోడి ధర రూ.4000..
వేలంలో దక్కించుకున్న సారయ్య

మంథని-జనత న్యూస్‌

పందెం కోళ్లకు వేలం వేశారు. అదీ పోలీస్‌ స్టేషన్‌లో ! కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వేలం పాట నిర్వహించగా..ఎక్కువ పాట పాడిన ఇద్దరు వ్యక్తులు.. రెండు కోళ్లను సొంతం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గత నెల 27న పెంచికల్‌పేటలో కోళ్ల చోరీలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు..పోలీసులు గాలింపు చేపట్టగా ఇద్దరు దొంగలతో పాటు రెండు కోళ్లను పట్టుకున్నారు. దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దొరికిన రెండు కోళ్లను వేలం వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్ది రోజుల పాటు పోలీస్‌ స్టేషన్‌లో కోళ్లకు దాన పెట్టి పోషించిన పోలీసులు..మంగళవారం వేలం పాట నిర్వహించారు. ఇందులో 25 మంది పాల్గొన్నారు. మార్కెట్‌ ధరతో కోళ్ల వేలం ప్రారంభించగా పురానం సారయ్య రూ. 4000 వేలు పాడి మొదటి కోడిని దక్కించుకోగా..రెండో కోడిని రూ. 2500 లతో దర్కించుకున్నాడు సత్యనారాయణ. వేలం పాటలో వచ్చిన డబ్మును డీడీ తీసి కోర్టుకు అప్పగిస్తామని ఎస్‌ఐ చంద్ర శేఖర్‌ తెలిపారు. ఎక్కడైన ఎవరికైనా కోడి దొరికితే, మసాలాతో పసందైన చికెన్‌ కర్రీ వండిరచి విందు చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. ఇక్కడి పోలీసుల తీరు ఇందుకు విభిన్నంగా..ఆదర్శంగా, స్ఫూర్తి దాయకంగా ఉందనే చర్చ జరుగుతోంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page