Tuesday, October 27, 2026

సొంత గూటికి కేశవరావు

ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్‌ సమక్షంలో చేరిక
రాజ్యసభకు రాజీనామా చేసే యోచనలో కేకే

డిల్లీ :
రాజకీయ భీష్ముడు, సీనియర్‌ నేత కే కేశవ రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. న్యూ డిల్లీలో బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం ఏ రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో సుమారు ఐదు దశాబ్దాల పాటు వివిధ హోదాలో పని చేసిన కేకే..2013లో ఆ పార్టీని వీడీ టీఆర్‌ఎస్‌లో చేరారు. వెంటనే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పోలిట్‌ బ్యూరో సభ్యునిగా అవకాశం కల్పించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే ఆయన కూతురైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ విజయ లక్ష్మి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. కేకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
కేకేకు ప్రాధాన్యతిచ్చే అవకాశం..
కేశవరావు 2005 నుంచి 2008 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన కేకే సేవలను, ప్రస్తుత సమయంలో వినియోగించుకోవాలని ఆ పార్టీ అదిష్టానం చూస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అంశాలపై అవగాహన ఉన్న కేకే సేవలను కాంగ్రెస్‌ ఏ రకంగా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page