Monday, October 26, 2026

అల్ఫోర్స్‌లో ‘రెయిన్‌బో’

  • చిన్నారుల మధ్య డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి
    కనువిందు చేసిన ప్రదర్శన
  • కరీంనగర్‌`జనత న్యూస్‌
    కరీంనగర్‌ వావిలాలపల్లి అల్ఫోర్స్‌ స్కూల్‌ ఆఫ్‌ జెన్నెక్ట్స్‌ స్కూల్‌ కలర్‌ ఫుల్‌గా మారింది. చిన్నారుల కలర్‌ఫుల్‌ ప్రదర్శన కనువిందు చేసింది. రెయిన్‌బో పేరుతో నిర్వహించిన చిన్నారుల ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. చిన్నారులతో కలసి ఆ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి సందడి చేశారు. ఎప్పుడూ బీజీ షెడ్యుల్‌ల్లో ఉండే ఆయన..ఇలా చిన్నారులతో కలసి వేడుకల్లో పాలు పంచుకోవడం పట్ల పిల్లలతో పాటు పేరెంట్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరేందర్‌ రెడ్డి తెలిపారు. వీటితో చిన్నారుల్లో నూతనొత్తేజంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు రెయిన్‌ బో గురించి బోధించడంతో పాటు ప్రాక్టికల్‌గా ఇలా చూపించడం వల్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన ‘రెయన్బో ఇజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌, ఓ రెయన్‌ ఓహో రెయన్‌ ’ నృత్యాలు ఆలోచింపచేశాయి.
    ప్రాంగనాన్ని వివిధ రంగు రంగుల వస్తువులతో చక్కగా అలంకరించి పండుగ వాతావరణాన్ని తలిపించారు. చక్కటి ప్రదర్శనను కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page