బెంగళూరులో ఓ వ్యక్తి మహిళను తన ఒడిలో పెట్టుకొని మోటార్ సైకిల్ పై వెళ్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కొందరు కోరారు. ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వరకు వెళ్లడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటన జరిగినట్టు తెలుస్తుంది ఈ సంఘటన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లో జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిని గుర్తించాలి బైకర్ను బెంగళూరులోని శ్యాంపూరా ఎంవీ లేఔట్ లో నివాసం ఉంటున్న సిలింబర్సన్ మే 17న ఉత్తర బెంగళూరులోని రెబల్ ఫ్లైఓవర్ పై ఓ అమ్మాయిని ఒళ్లో కూర్చొండబెట్టుకొని బైక్ నడిపారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు కామెంట్ చేశారు. ‘విన్యాసాలకు రోడ్డు వేదిక కాదు.. మీతో సహా అందరూ సురక్షితంగా ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘భద్రత గురించి ఆలోచించండి బెంగళూరు ఆదరించే నగరం గందరగోళానికి స్థలం కాదు ’ అరి మరొకరు అన్నారు.
ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వరకు వెళ్లడంతో ఆ వ్యక్తిని తన సొంత నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిపై సెక్షన్ 279, 184, 189 ప్రకరాం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Hey thrill-seekers, the road isn't a stage for stunts! Keep it safe for everyone, including yourselves. Let's ride responsibly. 🛑🏍️#RideResponsibly pic.twitter.com/Cdg96cpdXx
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) May 19, 2024