తెలంగాణలో 10 రోజులపాటు సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షో లు నిలిపి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో పాటు కొత్త సినిమాలు రిలీజ్ లేక నష్టం ఎక్కువగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శన ఆపాలని నిర్ణయించుకున్నట్లు ఎగ్జిబిటర్ కౌన్సిల్ ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 థియేరట్లు ఉన్నాయి. ప్రతీ ఏడాది సమ్మర్ లో ఎంతో కొంత లాభం ఉండేదని, కానీ ఈసారి ఎన్నికల కారణంగా కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో నష్టం ఎక్కువగా వచ్చిందన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ థియేటర్లు ఓపెన్ చేస్తామని తెలిపారు.
10 రోజుల పాటు ‘తెర’ మూసివేత..
- Advertisment -