Ram Pothineni: టాలీవుడ్ నటుడు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత రామ్ కు సరైన హిట్టు లేదు. ఈమధ్య బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘స్కంధ’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ముఖ్యంగా మూవీలోని కొన్నిసీన్లపై బాగా విమర్శలు వచ్చాయి. ఈ సినిమా అనంతరం స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి డబుల్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా చేస్తూనే రామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ తో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రాజెక్టు ప్రకటించే అవకాశం ఉంది.
డిజిటల్ ప్లాట్ ఫాం పైకి రామ్
- Advertisment -