Friday, March 13, 2026

Rain Report: మరికొన్ని రోజుల పాటు వర్షాలు :వాతావరణ శాఖ

హైదరాబాద్, జనత న్యూస్:  తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడికక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని పేర్కొంది.  హైదరాబాదులో బుధవారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని,  అలాగే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు ఉంటాయన్నారు. ఇవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page