Wednesday, October 28, 2026

పెద్దపల్లి: వేసవిలో ‘రూమ్ టు రీడ్’

పెద్దపల్లి,జనత న్యూస్: వేసవి కాలంలో పిల్లలు ఉల్లాసంగా గడిపేందుకు రూమ్ టు రీడ్ సంస్థ ప్రతి రోజు ఒక కొత్త కథను ఆడియో రూపంలో అందిస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలోని తన చాంబర్ లో రూమ్ టు రీడ్ ఉల్లాస సమయం పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలకు లెర్నింగ్ గ్యాప్ రాకుండా ఉండడానికి  రూమ్ టు రీడ్ సంస్థ ఐవీఆర్ఎస్ ను వినియోగించుకొని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిందన్నారు. పిల్లలకు ప్రతిరోజు ఉల్లాసవంతమైన కొత్త, కొత్త కథలు ఆడియో రూపంలో ఏర్పాటు చేయడం సంతోషకర మని కలెక్టర్ తెలిపారు.రూమ్ టూ రీడ్ ద్వారా పిల్లలు కొత్త, కొత్త కథలను వినాలని అనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 040-4520-9722 కు ఫోన్ చేయాలని, ప్రతి రోజూ ఒక కొత్త కథ పిల్లలకు టోల్ ఫ్రీ ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డీ.మాధవి, రీడ్ 2 రూమ్ సంస్థ రాష్ట్ర హెడ్ నరసింహాచారి,పాఠశాల అకడమిక్ అధికారి పీఎం షేక్, రీడ్ 2  రూమ్ సంస్థ రాష్ట్ర ప్రతినిధులు తేజస్వి, మధు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page