- నిందితుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు
- పలు కీలక పత్రాల స్వాదీనం
కరీంనగర్,జనత న్యూస్: నఖిలీ ధ్రువ పత్రాలు సృష్టించి, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చేసి ప్రజలను భయ బ్రాంతులను గురి చేసారని కరీంనగర్ ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడు మొహమ్మద్ లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు బారాజు రత్నాకర్ రెడ్డి(విద్యానగర్),చందా శంకర్ రావు(సాయి నగర్),బకిట్ సాయి(రేకుర్తి),పిట్టల మధు(జ్యోతి నగర్),షాహిద్ ఖాన్, (ముఖరాంపుర)కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే. కేసుకు సంబందించిన మరింత కీలక సమాచారం సేకరించేందుకు నలుగురు నిందితులను గురువారం కోర్టు అనుమతితో కొత్తపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాదీన పరుచుకున్నామని రూరల్ ఎస్ఐ ఏ. ప్రదీప్ కుమార్ తెలిపారు.