హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో రూ.50 లక్షలను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు వాహనాల్లో , ఇతర మార్గాల్లో డబ్బు తరలించారు. దీంతో తనిఖీలు ముమ్మరం కావడంతో రైల్లో నగదును తల్లిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత రైలులో రూ. 50 లక్షల రూపాయలు లభించాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఈ డబ్బులు తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు చేరుకున్న రైలులో దిగిన కొందరు వ్యక్తులను రైల్వే పోలీసులు తనిఖీ చేయగా.. ఈ డబ్బు బయటపడింది. ఎన్నికల కోడ్ కారణంగా రూ. 50 వేలకు మించి తరలించే పరిస్థితి లేదు. కానీ కానీ 50 లక్షల రూపాయలు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బును పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.
వందే భారత్ రైలులో రూ.50 లక్షలు పట్టివేత
- Advertisment -