కరీంనగర్,జనత న్యూస్:కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 44వ డివిజన్ కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంబేద్కర్ క్లబ్ అధ్యక్షులు కొంపల్లి రమణ్ కుమార్ ఆధ్వర్యంలో పావులా అనిల్ కుమార్,పిట్టల హరీష్ కిరణ్,కొరివి కరుణాకర్, జీ.చరణ్,క్రర నవీన్ కుమార్, బి.శంకర్, సాయి ధనుష్,రుత్విక్,మేకల సిద్ధార్థ,పిట్టల ఆశీష్,బీ.జైలుదాస్ తదితరులు చేరారు.
సివిల్స్ ర్యాంకర్ కౌశిక్ కు సన్మానం
కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ను జనగాం జిల్లాకు చెందిన సివిల్స్ 82వ ర్యాంకర్ కౌశిక్ ఎంపీ బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కౌశిక్ ను బండి సంజయ్ అభినందించారు.పట్టుదల, అంకిత భావంతో పరీక్షలు రాసి అత్యున్నత ఉద్యోగానికి ఎంపికవడం శుభపరిణామమని ఉద్యోగంలో చేరిన అనంతరం సమాజంలో పేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు.