Saturday, March 14, 2026

KTR : మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

KTR : హైదరాబాద్, జనత న్యూస్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బిజెపి అభ్యర్థి  ఈటల రాజేందర్ గెలవబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయ అనుభవంతోనే ఈటలపై కామెంట్ చేశారని అన్నారు. మల్లారెడ్డి చాలా తెలివైన వ్యక్తి అని, ఈటల రాజేందర్ ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలని ఆయన వ్యూహం అని తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈటలపై చేసిన వ్యాఖ్యలపై మల్లారెడ్డి తన రాజకీయ అనుభవం చాటుకున్నారని అన్నారు. అయితే మల్లారెడ్డి అంతరార్థం తెలియ కొంతమంది ఆగమవుతున్నారని, ఆయన వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవద్దని అన్నారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page