Tamanna Bhatiya: సౌత్ సినీ స్టార్ తమన్నా భాటియా కు మహారాష్ట్ర సైబర్ సెల్ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ అనుబంధ యాప్ అయిన ఫెయిర్ ప్లే యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను ఆమెకు మహారాష్ట్ర కోర్టు సమన్లు జారీ చేసింది. 2023 ఐపీఎల్ కు సంబంధించిన మ్యాచునలు అక్రమంగా ఫెయిర్ ప్లే ద్వారా ప్రసారం చేశారని, ఈ కారణంగా వయాకాం సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిలిందని, ఆ సంస్థను ప్రమోట్ చేసిన తమన్నాకు సమన్లు జారీ చేస్తున్నామని సైబర్ సెల్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 29న ఆమె విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. ఇక ఇదే విషయంలో మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు నోటీసులు అందాయి. ఆయనను ఏప్రిల్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నారని తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి తదుపరి తేది తిరిగి ఇవ్వాలని కోరారు.
Tamanna Bhatiya: సినీ నటి తమన్నాకు మహారాష్ట్ర కోర్టు నోటీసులు
- Advertisment -