Thursday, October 29, 2026

Youtubers : యూట్యూబర్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: యూట్యూబర్ల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  తమిళనాడులోసత్తాయ్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ హోస్ట్‌ దురై మురుగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది.  దురైమురుగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై న్యాయమూర్తులు అభయ్‌ ఎస్‌. ఓకా, ఉజ్జల్‌ భుయాన్‌ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం యూట్యూబర్‌ కు మంజూరయిన బెయిల్‌ ను పునరుద్ధరించింది. ఇదే సమయంలో రాష్ట్రం తరఫున  సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని ఉద్దేశించి సుప్రీం న్యాయమూర్తి ఓకా కీలక సవాలును లేవనెత్తారు.ఎన్నికలకు ముందు యూట్యూబ్‌ లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంత మందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి అన్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పై దురైమురుగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింనందుకు ఆయనను అరెస్టు చేశారు. తర్వాత అతడు బెయిల్‌ పై బయటికొచ్చారు. కానీ మద్రాస్‌ హైకోర్టు అతడి బెయిల్‌ ను రద్దుచేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో కోర్టు ఆయనకు బెయిల్‌ ను పునరుద్ధరించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page