Pawan Kalyan: పవన్ కల్యాన్ పర్యటన మరోసారి రద్దయింది. మూడు రోజుల కిందట ప్రచారంలో పాల్గొన్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే రెండు రోజుల తరువాత ఆదివారం వారాహి యాత్రలో పాల్గొన్నారు. ఆ తరువాత అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే మరోసారి జ్వరం రావడంతో సోమవారం యలమంచి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎండవేడికి ఆయన ఆరోగ్యం తట్టుకోలేకపోతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పిఠాపురం లోక్ సభ నుంచి పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన జనసేన పార్టీ పోటీ చేస్తన్న 21 స్థానాల్లో జనసేన విజయం కోసం విస్తృత పర్యటనలు చేస్తున్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి రద్దు..
- Advertisment -