Friday, March 13, 2026

తెలంగాణ ప్రజలకు తీపి కబురు

Telangana Wather Report:  కొన్ని రోజులుగా తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్న తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం  తెలంగాణలో ఉదయం  7 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్ మొదటి వారంలో వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తుండడంతో జనం భయపడుతున్నారు. ఈ తరుణంలో  ఐదు రోజుల పాటు  తెలంగాణ అంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   ఈనెల 7 నుంచి 12 వరకు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ ఐఎండి అధికారులు తెలిపారు. సోమవారం అదిలాబాద్, కొమరం భీం,  నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఉంటాయని తెలిపారు. ములుగు, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 10న నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం అవకాశం ఉందన్నారు  హైదరాబాదులో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page