Bengalore: 120 అడుగుల భారీ రథం కుప్పకూలింది. బెంగళూరు సమీపంలోని మద్దూరమ్మ జాతరలో జరిగిన ఈ అపస్తృతితో భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. బెంగళూరు అనేకల్ తాలూకాలోని హంస్కూరు లో ప్రతి ఏడాది మద్దూరమ్మ జాతర జరుపుకుంటారు. జాతరలో భాగంగా 10 గ్రామాల ప్రజలు పెద్ద రథాలను అలంకరించి ఊరేగిస్తారు. ఈ సంవత్సరం కూడా జాతర కోసం అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఊరేగింపు కోసం నాలుగు రథాలను ఏర్పాటు చేసి వీటిని ట్రాక్టర్లు, ఎద్దులతో లాగడానికి సిద్ధం చేసి ఉంచారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 125 అడుగుల భారీ రథాన్ని అలంకరించి తాళ్ల సాయంతో పైకి లేపారు. అనంతరం పట్టుకోల్పోయిన రథం పక్కకు ఒరిగి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భక్తులు పరుగులు తీశారు. అదృష్టవంశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
A 120-foot tall chariot collapses during a temple fair at the Madduramma in Huskoor, Anekal taluk, on the outskirts of Bengaluru. This has caused a stir among the devotees.
Luckily Devotees escape unhurt.#Chariot #Bengaluru #Huskoor #Madduramma #ChariotCollapses pic.twitter.com/XrXmUKTYFL
— Surya Reddy (@jsuryareddy) April 6, 2024