Sunday, October 25, 2026

Monkeay Plauaged: కలెక్టరేట్ కు కోతుల బెడద.. కర్రలతో పనిచేస్తున్న సిబ్బంది..

Monkeay Plauaged: యాదాద్రి:  కోతుల బెడద యాదాద్రి జిల్లా కలెక్టరేట్ కు తాకింది. భువనగిరి శివారు పగిడిపల్లిలోని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కు నిత్యం వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సామాన్యులు వస్తూ పోతుంటారు. పట్టణ శివారులోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోతులు హల్ చల్  చేస్తున్నాయి. దీంతో కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగులు, అక్కడికి వచ్చే సామాన్యులు కోతులతో భయాందోళన చెందుతున్నారు.  కార్యాలయంలో లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్న ఉద్యోగులు సిబ్బంది జంకుతున్నారు. మహిళా ఉద్యోగులు అయితే కోతులను చూసి తమ కార్యాలయాల తలుపులను మూసివేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వరండాలో కోతులు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎవరి చేతిలో ఏదైనా కనిపిస్తే చాలు మాయం చేస్తున్నాయి.  దీంతో కార్యాలయ సిబ్బంది చేతి కర్ర ఉంటేనే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, సిబ్బంది కర్రలు చేత పట్టుకుని కోతులను తరుముతున్నారు. కలెక్టరేట్ వద్ద కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ అధికారులను ఉద్యోగులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లోని కోతుల బెడద ఉందని చెబితే  పట్టని అధికారులు ఇప్పుడు కార్యాలయాలకు తాకడంతో  ఆందోళన చెందుతున్లునారని  సామాన్యులు అంటున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page