జనతన్యూస్ బెజ్జంకి : రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని బెజ్జంకి ఎస్సై జి కృష్ణారెడ్డి, సిద్దిపేట రూరల్ సిఐ శ్రీనివాస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు యువకులకు, ఓటు హక్కు, ఓటు విలువ గురించి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ అధికారులు మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికలలో ఓటు వేసుకునే స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పిస్తామని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలన్నారు. ప్రజలతోపాటు యువకులు పోలీస్ అధికారులతో పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, మనకు నచ్చిన ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి ఓటు ఒక వజ్రాయుధమని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులుంటే 1950 కి కాల్ చేయాలని, సైబర్ నేరాలు జరిగితే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలనిసూచించారు.
బెజ్జంకి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిశీలన
- Advertisment -