Vijaya Devarakonda: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన మ్యారేజ్ పై ఓపెన్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఏప్రిల్ 5న విడుదల కారుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలిపారు. ఇదే సమయంలో తన పెళ్లి విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని తనకు కూడా ఉందని, కాకపోతే ఇప్పుడే చేసుకోనని అన్నారు. అయితే పెళ్లి చేసుకుంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అన్నారు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా తల్లిదండ్రులకు కచ్చితంగా నచ్చాలి అని అన్నారు. కొంతమంది తమిళ దర్శకులు నాకు కథలు చెప్పారని, అందులో కొన్నింటి గురించి ఆలోచిస్తున్నానని అన్నారు. గౌతం తిన్ననూరితో నేను చేయబోయే చిత్రంలో చాలామంది కోలీవుడ్ నటులు నన్ను భాగం కావాలని అన్నారని తెలిపారు. ‘ఫ్యామిలీ స్టార్’ యూనివర్సల్ కంటెంట్ ఉందని, ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుందని అన్నారు.
Vijaya Devarakonda:లవ్ మ్యారేజీ చేసుకుంటా: విజయ్ దేవరకొండ
- Advertisment -