Saturday, March 14, 2026

కరీంనగర్: బార్ అసోసియేషన్ ఎన్నికలు.. బరిలో ఉన్నది వీరే..

కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ బార్ అసోసియేషన్ కు పోటీచేసే నామినేషన్లల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం  ముగియడంతో అనంతరం పోటీ చేసే న్యాయ వాదుల లిస్ట్ ను ఎలక్షన్ అధికారి కాసుగంటి మాధవరావు విడుదల చేశారు. ఈనెల 28న జరగబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నాగరాజు లింగంపల్లి, రాజారెడ్డి లెంకల, రాములు పురెల్ల, సత్యనారాయణ రావు జూపల్లి, వెంకట రాజ్ కుమార్ పోలు బరిలో ఉన్నారు.

ఉపాధ్యక్ష పదవికి రఘువీర్ తిరుకోవెల, శ్రీనివాస్ పటేల్ వేముల, శ్రీనివాస రావు పెంచల, సయ్యద్ సాభిర్.. జనరల్ సెక్రెటరీ పదవికి భూమాచారి చెల్లోజు, మహేందర్ రెడ్డి బేతి, ప్రదీప్ కుమార్ రాజ్ చతరాజ్…కార్యదర్శి పదవికి బీమా గుగులోతు, ప్రసాద్ నరేందుల, శ్రీధర్ రావు సిరికొండ, శ్రీనివాస్ పేరుక.. కోశాధికారి పదవి కి శ్రీనివాస్ రామగిరి.. స్పోర్ట్ అండ్ కల్చరల్ సెక్రెటరీ పదవికి రవి మాడిపల్లి.. లైబ్రరీ సెక్రెటరీ పదవికి రాజేందర్ కటకం, తేజ్ దీప్ రెడ్డి కోమటిరెడ్డి.. లేడీ రిప్రజెంటేటివ్ పదవికి హేమలత పటేల్ మొరాయ్ , రేణుక డి.. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మూడు పదవులకు ఏడుగురు , జూనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మూడు పదవులకు ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు.

నామినేషన్ల పరిశీలన లో లేడీ రిప్రెజెంటేటివ్ పోస్ట్ కు సతీష్ గంట, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కు పోటీచేసిన చంద్రశేఖర్ మేరుగు ఇద్దరు డిస్ క్వాలిఫై అయినారని, కార్యదర్శి పదవికి చంద్రమౌళి కొలిపాక, హేమలత పటేల్ మోరాయ్ లు నామినేషన్ ఉపసంహరణలు చేసుకున్నారని, కోశాధికారి పదవికి, స్పోర్ట్స్ అండ్ కల్చర్రల్ సెక్రటరీ పదవులకు ఒక్కరు చొప్పున నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారి మాధవరావు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page