రామగుండం, జనతాన్యూస్: సింగరేణి సంస్థ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో 327 పోస్టుల భర్తీ చేసేందుకు మార్చి 14న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను అధికారిక వెబ్ సైట్ లో ఉంటాయని తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కేడర్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ 49 పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో భాగంగా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ 100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరి -1 లో 47 పోస్టులు, ఎలక్ట్రిషన్ ట్రైని కేటగిరిలో 90 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి విద్యా అర్హతల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లపాటు సడలింపు ఉంటుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు. పోస్టుల వారీగా విద్యార్హతలను గుర్తిస్తారు.
రామగుండం: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- Advertisment -