న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కు శనివారం ఉదయం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈడీ అధికారులు ఆమెను హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం వరకు ఈడీ ఆఫీసులోనే ఉన్న ఆమెకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. ఈ కేసులో కవితను విచారించేందుకు 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కవిత అరెస్ట్ పై తెలంగాణలో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిన్ననే నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసేందుకు రెడీ అవుతున్నారు.
కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత
- Advertisment -