హైదరాబాద్, జనతా న్యూస్: వర్షాకాలం వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ‘చలో మేడిగడ్డ’ పేరిట బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ప్రాజెక్టు సందర్శన కార్యక్రమంలో భాగంగా శుక్రవారంనాడు మేడిగడ్డ ప్రాజెక్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని, ఆలస్యం చేస్తే ప్రాజెక్టు పూర్తిగా దెబ్బ తింటుందని, అలా కావాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని, అలాంటి ప్రాజెక్టుపై రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
వర్షాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలి : కేటీఆర్
- Advertisment -
