Drug Case : ఇటీవల రాడిసన్ హోటల్ లో దొరికిన డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీని మరోసారి కుదిపేసింది. ఈ హోటల్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న పెడ్లర్ అబ్బాస్ క్రిష్ పేరు చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వివేకానందతో కలిసి డైరెక్టర్ క్రిష్ హోటల్ కు వచ్చినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా గజ్జెల వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ హాజరయ్యారని అంటున్నారు. అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కొందరు చెబుతున్న ప్రకారం క్రిష్ రాడిసన్ హోటల్ కు వచ్చిన మాట వాస్తవమేనని కానీ తన డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. ఇంకా ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు? అనే విషయంపై విచారించనున్నారు.
Breaking News : రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్
- Advertisment -