Trisha: ప్రముఖ నటి త్రిష తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఏ డీఎంకే మాజీ నాయకుడు ఏవి రాజు పై పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని త్రిష ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవి రాజు మాట్లాడుతూ త్రిషను ఉద్దేశించి కొన్ని అనుచిత వాఖ్యలు చేశారు. ఆ వార్తలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రాజ వాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో త్రిష స్పందిస్తూ అటెన్షన్ కోసం ఏ స్థాయికి అయిన దిగజారి పోయే వారిని పదేపదే చూస్తూ ఉండటం అసహ్యంగా ఉందని అన్నారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా భారీ మొత్తం నష్టపరిహారం ఆర్జిస్తూ పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా త్రిష వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఏవీ రాజు త్రిషకు క్షమాపణలు చెప్పారు. అయినా త్రిష వెనక్కి తగ్గకుండా తనపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది.
Trisha: ఏవీ రాజుపై త్రిష పరువు నష్టం దావా
- Advertisment -