- కోరుట్ల, (జనతా న్యూస్):కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో చైర్ పర్సన్ అధ్యక్షతన 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదించడం జరిగినది. ఇట్టి సమావేశంలో ఎమ్మెల్యే కె. సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్మన్ మరియు వార్డ్ కౌన్సిలర్స్ మాట్లాడుతూ మన కోరుట్ల పట్టణాన్ని అత్యుత్తమ పట్టణంగా తీర్చి దిద్దుటకు గాను ఈ బడ్జెట్ రూపొందించబడినది అని అలాగే ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో మన కోరుట్ల పట్టణం అభివృద్ధి లో రాష్ట్రంలోనే ఉత్తమ స్థానం కలిగి ఉన్నదని రాబోవు రోజుల్లో కూడా ఆదాయ వనరులను పెంచుటకు గాను కౌన్సిలర్స్ మరియు ప్రజలు సహకారం అందించాలని కోరినారు.ఇట్టి సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, చైర్ పర్సన్ అన్నం లావణ్య , వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ , మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి , డి వై ఈ ఈ అభినయ్ , టీ పి ఓ ప్రవీణ్ , టీపీఎస్ రమ్య , జేఏఓ వి . శివ కుమార్ , మేనేజర్ హెచ్ .రాకేష్ , శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వార్డ్ కౌన్సిలర్స్, కో – మెంబెర్స్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోరుట్ల : మున్సిపల్ బడ్జెట్ ఆమోదం
- Advertisment -