Kcr Birthday: హైదరాబాద్, జనత న్యూస్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో 70 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్థానంపై డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. అటు ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళ సౌ సౌందర రాజన్ కేసీఆర్ కు బర్త్ డే విషెష్ తెలుపుతూ ఓ లేఖను, పుష్పగుచ్చాన్ని గవర్నర్ కార్యాలయంల నుంచి పంపించారు. దీనిని ఓ ప్రతినిధి తెలంగాణ భవన్ లో తలసాని శ్రీనివాసయాదవ్ కు అందించారు. అటు అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెష్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సభను సజావుగా నడపడానికి దేవుడు ఆక్ష్నకు పూర్తి స్థాయిలో శక్తి కల్పించాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు.
Kcr Birthday: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisment -