Monday, October 26, 2026

Aravind Kezriwal: వర్చువల్ ద్వారా విచారణకు కేజ్రీవాల్

Aravind Kezriwal:  మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్ శనివారం వర్చువల్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ చేసిన ఫిర్యాదు పై ఇటీవల కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున శనివారం విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ సహకరించడం లేదంటూ హౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది.  దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్ కు  ఈడీ ఆరుసార్లు సమర్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19 విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అంతకు ముందు ఐదు సార్లు విచారణకు పిలువగా సీఎం గైర్హాజరయ్యారు. ఏప్రిల్ లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ డి నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page