Telangana Assembly: హైదరాబాద్, జనత న్యూస్: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. కృష్ణ జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడేందుకు హరీష్ రావుకు అవకాశం వచ్చింది. ఇది సత్యదూరమైన ప్రజంటేషన్ అంటూ హరీష్ రావు ఆరోపించారు. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ నల్గొండలో సభ పెడుతుంటే ప్రభుత్వం తప్పులను సరిచేసుకుంటుందని అన్నారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించారన్నారు. ఏపీ అసంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ వినిపించలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలు కలిసి తమ జిల్లాను మోసం చేశారని అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పిన తరువాత నల్గొండ సభకు రావాలని అన్నారు. అయితే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అలా అనడం సరికాదంటూ కోమటిరెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Assembly: కోమటిరెడ్డి వెంకటరెడ్డి Vs హరీష్ రావు
- Advertisment -