విజయవాడ, జనత న్యూస్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల.. ఆ తరువాత ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, మూడు రాజధానులు అని ఒకటి కూడా నిర్మించలేదని ఇప్పటికే హాట్ కామెంట్స్ చేసిన ఆమె తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చిందని జగన్ అంటున్నారు… కానీ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయకుండా దయనీయ స్థితిలో ఉంచడానికి కారణం జగనే కదా.. అంతేకాకుండా వైఎస్ ఆర్ కుటుంబ ఇలా విచ్చిన్నం కావడానికి నువ్వే కదా.. ఇందులో నా తల్లి విజయమ్మే సాక్ష్యం.గతంలో జగన్ పార్టీ ఇబ్బందిలో ఉన్న సమయంలో కేవలం 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడిన సమయంలో ఆప్పుడు జగన్ వైపు ఉన్నది నేను కాదా.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులను చేస్తానని అన్నారు. కానీ అలా జగన్ వైపు నిలబడిన వారిలో ఎంత మంది మంత్రులయ్యారు? పార్టీ నాయకుల గెలుపు కోసం అమ్మ, నేను కలిగి ఎంతో కష్టపడ్డాం. కానీ ఈరోజు మాకు చేసిందేమిటి?’ అంటూ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిస్థితికి జగనే కారణం: షర్మిల సంచలన వ్యాఖ్యలు
- Advertisment -