ఇల్లంతకుంట జనవరి 23 (జనతా న్యూస్) ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు పోషణ అభియాన్ ప్రదర్శన మంగళవారం నాడు ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేశారు అంగన్వాడీ టీచర్లు తమ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు ప్రీ ప్రైమరీ పిల్లలకు మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఇచ్చే వివిధ రకాలైన పౌష్టికాహార పదార్థాల రకాలను వాటి పోషక విలువలను ప్రజలకు తెలియపరుస్తూ స్టాలపై పెట్టి ప్రదర్శన చేశారు గర్భిణీ స్త్రీలకు అన్నం పప్పు గుడ్డు ఇస్తామని ప్రీ ప్రైమరీ పిల్లలకు అన్నం గుడ్డు పెడతామని 7 నెలల నుండి మూడు సంవత్సరముల లోపు పిల్లలకు బాలామృతం 16 కోడిగుడ్లు ఇస్తామని అంగన్వాడీ టీచర్లు సందర్శకులకు వివరించారు ఇదే కార్యక్రమంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వారు వివిధ రకాల రక్త పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు సెక్రటరీ వరుణ్ అంగన్వాడీ టీచర్లు రహీమున్నీసా బేగం ఒగ్గు విజయలక్ష్మి బైరి అరుణ కాసుపాక బాబాయి ఏఎన్ఎంలు సుహాసిని స్వప్న ఆశా వర్కర్లు మరియు సిఏలు రాణి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
ఇల్లంతకుంటలో పోషణ్ అభియాన్ ప్రదర్శన
- Advertisment -
